Birth Certificate in AP : బర్త్ సర్టిఫికేట్ లేదా..? అయితే ఇలా పొందండి

Spread the love

ఆంధ్రప్రదేశ్లో జనన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో ఎలా పొందాలి?,how to apply birth certificate in andhra pradesh,How can I get my Birth Certificate online in Andhra Pradesh?

బర్త్ సర్టిఫికేట్ లేదా? మీరు ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదా? అయితే ఇప్పుడు సులువుగా పొందండి. బర్త్ సర్టిఫికేట్ లేనివారికి స్వీయ దరఖాస్తు ఫారం ఫిల్ చేసి ఎంపీడీవో, తహసీల్దార్ వారి సంతకంతో అప్లికేషన్ ను సచివాలయంలో సబ్మిట్ చేసి బర్త్ సర్టిఫికెట్ పొందవచ్చు.

బర్త్ సర్టిఫికెట్ పొందే ప్రక్రియ

తొలిత సచివాలయానికి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి. ఆ తరువాత నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి. తరువాత విద్యార్థి స్టడీ లేదా ఎస్ఎస్‌సీ మార్కుల మెమో, విద్యార్థి తండ్రి, తల్లి ఆధార్ కార్డులు, నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు(లేట్ డేట్ ఆఫ్ బర్త్) చేయించుకోవాలి.

ఆ పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ విలేజ్ రెవ్యెన్యూ అధికారి (విఆర్వో)కి సమర్పించాలి. వీఆర్వో సంతకం తరవాత అక్కడ నుంచి ఆర్ఐకి ఫైల్ వెళ్తుంది. ఆర్ఐ సంతకం తరువాత అక్కడ నుండి ఎమ్మార్వోకి ఫైల్ అవుతుంది. ఎమ్మార్వో సంతకం తరువాత అక్కడ నుండి ఆర్‌డీవోకి ఫైల్ వెళ్తుంది.

ఆర్‌డీవో ఆమోదం తరువాత సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌, లేదా మీ దగ్గరలోని మీసేవ సెంటర్‌లో ప్రొసీడింగ్ ప్రింట్‌ పొందవచ్చు. ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రకంగా బర్త్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ పొందని వారు ఈ ప్రక్రియ ద్వారా బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు.

బర్త్ సర్టిఫికేట్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆధార్ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్‌తో కొత్తగా ఆధార్ తీసుకోవచ్చును. ఆధార్‌ ఇంత వరకు తీసుకోనివారికి ఇప్పుడు తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చును. అలాగే ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవడానికి కూడా బర్త్ సర్టిఫికేట్ ఉపయోగపడుతోంది.

Home PageClick Here

Leave a comment